అవతార పురుషుల తోడ్పాటు
ఇది ఎలా సాధ్యమవుతున్నది? పరంపర ద్వారా.అవతార పురుషులు తమ సందేశాలను మానవజాతి అంతటికి వ్యాప్తి చేయ సమర్ధులైన శిష్యులను తయారుచేసి, వదలి వెళుతున్నారు.వారి సందేశాల ప్రభావం, స్ఫూర్తి ఈశిష్యులద్వారా విద్య ,కళ ,విజ్ఞానం, మతం, ఆధ్యాత్మికత అనబడే సకల రంగాలకూ వ్యాప్తి గాంచుతుంది.వారి సందేశం ఒక నూతన శాస్త్రంగా రూపుదిద్దుకొంటుంది.అప్పటివరకు ఉంటూ వస్తున్న ఏ శాస్త్రాన్నిగాని అది నిందించటమో, విమర్శించటమో , తిరస్కరించటమో చేయదు; అందుకు మారుగా ఆ శాస్త్రం మునుపటి శాస్త్రాల అన్నింటి సంకలనంగా, పరిపూర్ణ రూపంగా పరిణమిస్తుంది. ఈ విధంగ వారి సాటిలేని జీవితం ద్వారానూ,వారు వదలి వెళ్ళే సందేశాల ద్వారానూ మానవజాతికి ఒక నూతన మార్గం,కాలానుగుణమైన ఒక వెలుగుబాట ఆవిష్కృతమౌతుంది.
భగవాన్ శ్రీరామకృష్ణులు
ఈ అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీరమకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో ఒక అంశాన్ని స్వీకరించి, దానిని తమ జీవితం ద్వారానూ,రచనలూ ప్రసంగాలు వివిధ మార్గాల వారానూ ప్రపంచానికి చాటారు.
ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాధ గుప్త(‘మ‘). శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొందిన వారు ఈయన.తద్వారా ప్రపంచ మత చరిత్రలో తరగని కీర్తినార్జించారు.
శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులు
1882వ సం|| ఫిబ్రవరిలో "మ" శ్రీ రామకృష్ణులను ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటినుండి శ్రీ రామకృష్ణుల మహాసమాధి(1886)వరకు దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందినవారాయన.ఆయన ఉపదేశాలను తమ డైరీలో రాసుకొని, పదిలపరిచారు. ఆ తరవాత వాటిని శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. దీని తెలుగు అనువాదమే శ్రీ రామకృష్ణ కథామృతము.
(గ్రంధ వైశిష్ట్యం తరువాత పోష్టులో)
Thursday, 10 June 2010
Subscribe to:
Post Comments (Atom)


అద్బుతం కోదండ రామాంజి బాబు..ఆ అమృత వాక్యలను కుడా రాసుంటే బాగుండేది..స్వామి వివేకానందా.పరమహంస లాంటి వారి గురించి ఎంత తెలుసుకున్న తక్కువే వారి శోధన అద్బుతం..
ReplyDeleteదన్యవాదాలు
కామెంట్లు గురించి పట్టించుకోకుండా రాస్తు ఉండండి
ReplyDelete