మొదట ఆత్మ లాభాన్ని పొందు.తదుపరి ధనం సంపాదించు. ఈ వరుసను తల్లక్రిందులు చేయాలని ప్రయత్నించకు.పరమార్ధాన్ని పొందాక సంసారంలో మెలిగినా నీ మనశ్శాంతికి భంగం వాటిల్లబోదు.
శ్రీ రామకృష్ణ బోధామృతము,పే.26.
Monday, 2 November 2009
జీవుడి పరమావధి
దుర్లభమైన మానవ జన్మ పొందీ,ఈ జన్మలోనే భగవంతుణ్ణి తెలుసుకో ప్రయత్నించని వ్యక్తి జీవితం నిరర్ధకం.
శ్రీ రామకృష్ణ బోధామృతము,పే.25
Sunday, 1 November 2009
జీవుడి పరమావధి
రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి.సూర్యోదయమైనాక అవి కనపడవు.అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా ! అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొనలేకపోయినందువల్ల, భగవంతుడు లేడనవద్దు. శ్రీ రామక్రిష్ణ బోధామృతము,పే.25.
నా పేరు కోదండ రామాంజి బాబు,అప్పిచర్ల.వయస్సు 45.మా వూరు ప్రకాశం జిల్లా,యద్దనపూడి మండలం,పూనూరు గ్రామం.హైస్కూలు వరకు ఇక్కడే.గుంటూరు హిందూ కాలేజీ లో ఇంటర్(యం.పీ.సీ.1980-82).ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బి.ఏ.,ప్రైవేటుగా.కొంత కాలం కండక్టర్ గా ఆర్.టీ.సీ.లో.ప్రస్తుతం ఖాళీగా ఇంటి దగ్గర.
అనేక రంగాలలో ప్రవేశం ఉంది కానీ దేనిలోనూ ప్రావీణ్యం లేదు.శ్రీ రామకృష్ణ పరమహంస దేవులు, వివేకానంద స్వామి బోధనల పరిచయం కారణంగా ‘నాకు ఏమీ తెలియదు‘ అని తెలిసింది.